: నదులను కాపాడుకుందాం: ఎంపీ చిరంజీవి పిలుపు
నదులు ఎన్నో తరాలుగా మనల్ని పోషిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. నదులు ఇంకిపోతున్నాయని, ఎండిపోతున్నాయని, నదులను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. అలా చేయని పక్షంలో భవిష్యత్ తరాలకు మంచి నీరు కూడా దొరకని పరిస్థితి దాపురిస్తుందని అభిప్రాయపడ్డారు. నదులను కాపాడేందుకు ర్యాలీ ఫర్ రివర్స్ కు మద్దుతు ఇద్దామని ఈ సందర్భంగా చిరంజీవి పిలుపు నిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలో ఆయన మాట్లాడుతూ, ‘మన నదులను మనమే కాపాడుకుందాం. అందుకోసం, ‘ర్యాలీ ఫర్ రివర్స్’ తో చేతులు కలపండి. 8000980009కు మిస్డ్ కాల్ నేను ఇచ్చాను. అలాగే, మీరూ ఇవ్వండి. రండి, మన నదులను మనమే కాపాడుకుందాం’ అని అన్నారు.

Mega Star #Chiranjeevi supports #RallyForRivers pic.twitter.com/edVdm0lIGU
— BARaju (@baraju_SuperHit) September 2, 2017