: బాబాయ్ పై ప్రశంసలు కురిపించిన రామ్ చరణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు యంగ్ హీరో రామ్ చరణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా ఓ ప్రత్యేకమైన లోగోను తయారు చేసి, సోషల్ మీడియాలో తన డిస్ ప్లే పిక్ గా కూడా పెట్టుకున్నాడు. ఈ సందర్భంగా పవన్ వంటి బాబాయికి కుమారుడిగా ఉండటం తన అదృష్టమని చెప్పాడు. నిజాయతీగా ఉండటం, హార్ట్ ఫుల్ గా మాట్లాడటం, సింపుల్ గా ఉండటం లాంటివన్నీ బాబాయ్ ను చూసే తాను నేర్చుకున్నానని చెప్పాడు. ఎంతో మందికి బాబాయ్ అండగా ఉంటారనేది తన నమ్మకమని తెలిపాడు. మానవత్వానికి బాబాయ్ ఒక నిదర్శనమని చెప్పాడు.