: టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ కు పండంటి బిడ్డ!


టెన్నిస్‌ స్టార్ సెరెనా విలియమ్స్‌, కాబోయే భ‌ర్త అలెక్సిస్ ఒహ‌నియ‌న్ పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. ఫ్లోరిడా వెస్ట్ పామ్ బీచ్ లోని ఓ మెడికల్ సెంటర్ లో సెరెనా నిన్న రాత్రి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. పుట్టిన చిన్నారి ఆరోగ్యంగా ఉందని పేర్కొన్నారు. ఈ వార్తతో సెరెనాకు అభినందనలు వెల్లువెత్తాయి. సెరెనాను అభినందిస్తూ టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ ఓ ట్వీట్ చేయగా, హాలీవుడ్ సింగర్ బేవొన్స్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో సెరెనా గర్భవతిగా ఉన్న ఫొటోను పోస్ట్ చేసి అభినందించింది. కాగా, సెరెనా గర్భవతి అనే విషయాన్ని ఏప్రిల్ లో ప్రకటించింది. తమకు బిడ్డ పుట్టాకే పెళ్లి చేసుకోవాలని సెరెనా ప్రేమజంట గతంలో నిర్ణయించుకున్నారు. ఆ జంటకు చిన్నారి సెరెనా పుట్టింది కాబట్టి, ఇక వారి పెళ్లి కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
 
 

  • Loading...

More Telugu News