: వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించిన జగన్, కుటుంబసభ్యులు


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకు ఈ రోజు ఉదయం జగన్, ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్ సోదరుడు వివేకానందరెడ్డి తదితరులు వెళ్లారు. వైఎస్ సమాధి వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. వైఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. కాగా, ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఓ ట్వీట్ చేశారు. ‘వైఎస్ఆర్ బతికే ఉన్నారు. ఎందుకంటే, ఎందరో జీవితాలను ఆయన మెరుగుపరిచారు... వైఎస్ ఆర్ బతికే ఉన్నారు..ఎందుకంటే, మన హృదయాల్లో ఆయన ఉన్నారు కాబట్టి’ అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News