: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి దంపతులు
తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహాద్వారం వద్ద ఇఫ్తికపాల్ ఆలయ మర్యాదలతో కోవింద్ కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. కాగా, రంగనాయక మంటపం వద్ద రాష్ట్రపతికి వేదపండితులు ఆశీర్వచనాలు చేశారు. రాష్ట్రపతికి శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను టీటీడీ అధికారులు అందజేశారు. అంతకుముందు, వరాహస్వామిని రామ్ నాథ్ దంపతులు దర్శించుకున్నారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు అచ్చెన్నాయుడు, అమర్ నాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు.