: హైదరాబాదులో నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక బస్సులు!


ఈ నెల 5న జరిగే గణేష్‌ నిమజ్జనానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ పురుషోత్తం తెలిపారు. గ్రేటర్‌లోని పలు ప్రాంతాల నుంచి 500 ప్రత్యేక బస్సులు ట్యాంక్‌బండ్‌ వరకు నడిపేలా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఆయా ప్రాంతాల నుంచి ట్యాంక్‌బండ్‌కు వచ్చే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అవసరమైతే మరిన్ని బస్సులు నడుపుతామని చెప్పారు.

గ్రేటర్ జోన్‌ 29 డిపోల నుంచి నిమజ్జనానికి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని, పలు జిల్లాల నుంచి నిమజ్జన వేడుకలు తిలకించే నిమిత్తం హైదరాబాద్ వచ్చే వారి కోసం జూబ్లీ బస్టాండ్‌ నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండేలా చూస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక బస్సుల నిర్వహణ నిమిత్తం 50 మంది అధికారులు, 100  మంది సూపర్‌ వైజర్లు పలు ప్రాంతాల్లో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు పురుషోత్తం పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News