: హార్వే హరికేన్ నేపథ్యంలో పోలీసు అధికారికి కూతురు లేఖ.. సోషల్ మీడియాలో వైరల్!


అమెరికాలోని టెక్సాస్ ను హార్వే హరికేన్ అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ సహాయక చర్యల్లో పాల్గొన్న పోలీసు అధికారికి తన కుమార్తె రాసిన లేఖ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ లేఖలో ఆ బాలిక తనతండ్రికి ఏం రాసిందంటే...‘డాడీ! మీకు ఎలాంటి హాని కలగదని నేను ఆశిస్తున్నాను. మీరు ప్రజలకు చేయాల్సిన సేవ కంటే ఎక్కువ సేవే చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను’ అంటూ ఆయనలో స్పూర్తి రగిలించేలా లేఖను రాసింది. ఈ లేఖను ఆయన తన ఫేస్ బుక్ పేజ్ తో పాటు, పోలీసు డిపార్ట్ మెంట్ పేజ్ లో పోస్టు చేశారు. ఇది వైరల్ అవుతోంది. దానిని మీరు కూడా చూడండి. 

  • Loading...

More Telugu News