: ప్రత్యేకహోదా ఇవ్వకపోతే ఇవ్వలేమని స్పష్టంగా చెప్పండి: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వకపోతే ఇవ్వలేమని స్పష్టంగా చెప్పాలని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. చెయ్యాలనుకున్నది చెప్పడంలో తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేకహోదాపై విస్పష్ట ప్రకటన చేసేందుకు రాజకీయ పార్టీలకు ఉన్న అభ్యంతరం ఏంటని ఆయన నిలదీశారు. ప్రత్యేకహోదాపై ఉద్యమాన్ని ఎప్పుడూ ఆపలేదని ఆయన తెలిపారు. కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్ కోసం సెమినార్ నిర్వహించాలని అనుకుంటున్నానని ఆయన చెప్పారు. తాను చెప్పిన పనులు చేయాలని ప్రభుత్వంపై ఎన్నడూ ఒత్తిడి చేయలేదని ఆయన తెలిపారు. తనను పిలిస్తే ఎక్కడికైనా వెళ్తానని ఆయన చెప్పారు. తాను పేదల కోసం పని చేస్తున్నానని ఆయన చెప్పారు. తనకు ఏ పార్టీ పట్ల ప్రత్యేక అభిమానం లేదని ఆయన అన్నారు. జనసేన నిర్మాణం ఇంకా జరుగుతోందని ఆయన అన్నారు.