: క్రికెట్ జూదంతో సమానంగా మారిపోయింది: అర్జున రణతుంగ సంచలన వ్యాఖ్యలు
క్రికెట్.. జూదంలా మారిపోయిందని శ్రీలంక దిగ్గజ క్రికెటర్ అర్జున రణతుంగ సంచలన వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంక క్రికెట్ ను ఉన్నతస్థాయికి చేర్చిన రణతుంగ ఒక జాతీయ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ జట్టు ఎంతో దయనీయస్థితిలో ఉందని అన్నారు. నిజాయతీగా చెప్పాలంటే శ్రీలంక క్రికెట్ బోర్డు పరిపాలనా విభాగంలో చాలా లోపాలున్నాయని ఆయన చెప్పారు.
ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ బోర్డుని జూదగాళ్లు నడిపిస్తున్నారని సంచలన ఆరోపణ చేశారు. బోర్డులో ఉన్న ఏ ఒక్కరికీ క్రికెట్ ఆడిన అనుభవం లేదని ఆయన చెప్పారు. క్రికెట్ బోర్డును నడిపించేందుకు వారు అనర్హులని ఆయన చెప్పారు. ప్రస్తుతం క్రికెట్ జట్టుని జూదగాళ్లు నడిపిస్తుండడంతో క్రికెట్ జూదగాళ్ల ఆటగా మారిపోయిందని ఆయన విమర్శించారు. జట్టు వరుస ఓటములకు ఆటగాళ్ల కారణం కాదని, వారిని నిందించవద్దని ఆయన సూచించారు. ఆయన వ్యాఖ్యలు శ్రీలంకలో కలకలం రేపుతున్నాయి.