: కారు డ్రైవర్ కు ఇదో రకం సాయం.. మీరూ చూడండి!
ముంబయిలో వరదలు బీభత్సం సృష్టించడంతో అక్కడి ప్రభుత్వం ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు కూడా చేసిన విషయం తెలిసిందే. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపైకి వస్తోన్న వారు మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. వరద బాధితులకు సాయం చేయడానికి ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అయితే, ఓ యువకుడు చేసిన సాయం మాత్రం అందరికీ వింతగా అనిపిస్తోంది.
ప్రపంచంలో ఇటువంటి సాయం ఇప్పటివరకు ఎవ్వరూ చేసి ఉండరని నెటిజన్లు కితాబిస్తున్నారు. కుర్లా ప్రాంతంలో ఓ వ్యక్తికి చెందిన ఆడి కారు వైపర్లు పాడైపోవడంతో కారు అద్దాల్లోంచి చూస్తే రోడ్డు కనపడడం లేదు. దీంతో కారు నడపలేక వెనక్కి వెళ్లిపోలేక డ్రైవర్ తెగ ఇబ్బంది పడిపోయాడు. ఆయనను గమనించిన ఓ యువకుడు డ్రైవర్‌కు సాయం చేస్తానని ముందుకొచ్చాడు. ఆ కారు బానెట్ ఎక్కి అతను ఇంటికి చేరుకునేవరకు విండ్ షీల్డ్‌ను ఓ క్లాత్ తో శుభ్రం చేస్తూ దానిపైనే కూర్చున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మీరూ చూడండి...