: విజయవాడ రైల్వే స్టేషన్ లో 13 కేజీల బంగారం పట్టివేత!
విజయవాడ రైల్వే స్టేషన్ లో భారీ మొత్తంలో బంగారం పట్టుబడడం కలకలం రేపుతోంది. హౌరా నుంచి తిరుచురాపల్లి వెళ్తున్న ట్రైన్ లో తరలిస్తున్న ఈ బంగారాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగారంతో పాటు ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేకుండా ప్రయాణిస్తుండడంతో వారిని అదుపులోకి తీసుకున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.