: విరాట్ కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు


శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నిన్న‌ కొలంబో వేదిక‌గా జ‌రిగిన నాలుగో వ‌న్డేలో టీమిండియా సార‌థి విరాట్ కోహ్లీ సెంచ‌రీతో అల‌రించిన విష‌యం తెలిసిందే. ఇదే మ్యాచ్‌లో ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ కూడా సెంచ‌రీ బాదాడు. ఈ ఇరువురు ఈ మ్యాచ్ లో 219 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో వన్డేల్లో వేరు వేరు బ్యాట్స్‌మెన్‌తో కలిపి మొత్తం 10 సార్లు రెండు వంద‌ల పరుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పిన అరుదైన‌ రికార్డు కోహ్లీ ఖాతాలో ప‌డింది. అంతేగాక‌, నిన్నటి మ్యాచ్ ద్వారా త‌న కెరియ‌ర్‌లో 29వ వన్డే సెంచ‌రీ సాధించిన కోహ్లీ సనత్ జయసూర్య 28 సెంచరీల రికార్డును అధిగ‌మించాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన మూడవ క్రికెట‌ర్‌గా నిలిచాడు.  

  • Loading...

More Telugu News