: నేను బీజేపీలో చేరను...టీడీపీలోనే ఉంటాను: అశోక్ గజపతి రాజు


టీడీపీలోనే ఉన్నానని, ఆ పార్టీలోనే ఉంటానని కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ, తాను బీజేపీలో చేరనున్నానంటూ వచ్చిన వార్తలన్నీ అబద్ధమని అన్నారు. కేంద్ర మంత్రి వర్గవిస్తరణలో స్థానచలనం కలగనుందా? అన్న దానిపై ఆయన స్పందిస్తూ, మంత్రి వర్గ విస్తరణ తన పరిథిలోనిది కాదని అన్నారు.

టీడీపీ ఎంపీగా సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిని మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో ప్రమోషన్లు, డిమోషన్లు అని ఉండవని చెప్పిన ఆయన, ఒక్కోసారి ఉచ్ఛస్థితిలో.. కొన్ని సార్లు చెత్తబుట్టలో ఉంటామని ఆయన నిర్వేదం వ్యక్తం చేశారు. కాగా, అశోక్ గజపతిరాజు శాఖ మారుస్తారంటూ వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News