: డ్రగ్స్‌ కు బానిసైన కూతురిని పది రోజులుగా ఇంట్లోనే గొలుసులతో కట్టేసిన తండ్రి!


జీవితాల‌ని నాశనం చేసే డ్ర‌గ్స్ కు త‌మ పిల్లలు బానిస‌లు కాకుండా ఉండేందుకు త‌ల్లిదండ్రులు ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. అయిన‌ప్ప‌టికీ త‌ల్లిదండ్రుల క‌ళ్లు క‌ప్పి యువ‌త ఆ చెడు మార్గంలోనే వెళ్లాల‌ని శ‌త విధాలా ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోంది. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ తండ్రికి ఇటువంటి అనుభ‌వ‌మే ఎదురైంది. త‌న కూతురు డ్ర‌గ్స్ బారిన ప‌డి త‌న క‌ళ్లు కప్పి ఇంట్లోంచి పారిపోయి మ‌రీ డ్ర‌గ్స్ తీసుకుంటుండ‌డంతో ఆమెను క‌ట్ట‌డి చేసేందుకు పది రోజుల నుంచి ఆమె కాళ్లను గొలుసుతో కట్టేశాడు. ఈ ఘ‌ట‌న సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ యువతి తండ్రి కమల్‌ హొసిన్ మీడియాతో మాట్లాడుతూ... తాను నెలకు రూ.5000 సంపాదిస్తుంటాన‌ని చెప్పాడు. త‌న‌ కూతురికి తాను త‌ప్ప ఎవ్వ‌రూ లేర‌ని, ఆమెకు ఏడేళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడే ఆమె తల్లి చ‌నిపోయింద‌ని అన్నాడు. తాను చిన్న గదిలో త‌న కూతురు శాంటాతో కలిసి జీవిస్తున్నానని చెప్పాడు. త‌న కూతురు వీధిలోని ఇత‌ర పిల్ల‌ల‌తో కలిసి తిరిగి డ్ర‌గ్స్ కు అల‌వాటు ప‌డింద‌ని తెలిపాడు. డ్ర‌గ్స్ ముట్ట‌వ‌ద్ద‌ని బెదిరిస్తే ఇంటి నుంచి పారిపోయి మ‌రీ డ్ర‌గ్స్ తీసుకుంటోంద‌ని అన్నాడు. ఓ సారి ఆమె ఎనిమిది రోజులుగా కనిపించకుండా పోయిందని తెలిపాడు. తాను ఆమె కోసం వెత‌క‌ని చోటు లేద‌ని అన్నాడు. చివ‌ర‌కు త‌న‌ కూతురు డ్రగ్స్‌ బానిసలతో క‌లిసి, వేశ్యలతో పాటు ఫారెస్ట్ గేట్ ఫుట్లో క‌నిపించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. తాను పేద‌రికంలో ఉండ‌డంతో ఆమెను ఆసుప‌త్రికి కూడా తీసుకెళ్ల‌లేద‌ని తెలిపాడు. అందుకే ఇలా గొలుసులతో కట్టేశానని చెప్పాడు. 

  • Loading...

More Telugu News