: ఇంతకీ ఈ మాటలన్నీ విజయ్ దేవరకొండ మాట్లాడుతున్నాడా? అర్జున్ రెడ్డి మాట్లాడుతున్నాడా?: యాంకర్ అనసూయ


ముద్దు ఒక ఎమోషన్ అయితే సెక్స్ ఏంటి? అని అనసూయ సూటిగా ప్రశ్నించింది. 'అర్జున్ రెడ్డి' సినిమాలో హీరో వాడిన డైలాగ్ (బూతు) ను ఆడియో ఫంక్షన్ కు వచ్చిన వారందరితో పలికించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముద్దే ఒక ఎమోషన్ అయితే దానిని మించిన ఎమోషన్ సెక్స్ అని చెప్పింది. ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోకుండా ఉంటారా? సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ఆమె ప్రశ్నించింది.

 సెలబ్రిటీ అంటే ఆదర్శంగా ఉండాలని ఆమె సూచించింది. సెలబ్రిటీల పేరు చెప్పి, సినిమా పేరు చెప్పి తప్పుడు ఆలోచనలు రేకెత్తించడం సరికాదని ఆమె హితవు పలికింది. తానింకా ఆ సినిమా చూడలేదని...కానీ డబ్ స్మాష్ లో ఆ డైలాగ్ ను ఎవరు పడితే వారు చెబుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. విజయ్ దేవర కొండ చేస్తున్న ట్వీట్స్.. ఇంతకీ విజయ్ దేవరకొండ అభిప్రాయాలా? లేక అర్జున్ రెడ్డి అభిప్రాయాలా? అన్నది స్పష్టం కావాల్సి ఉందని ఆమె తెలిపింది. 

  • Loading...

More Telugu News