: ఈ నెల 5న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సెలవు: తెలంగాణ ప్రభుత్వం
వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సెలవు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా జిల్లాల్లో రహదారులపై రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకే సెలవు ఇస్తున్నట్లు వివరించింది. ఈ నెల 5న సెలవు ఇస్తున్న నేపథ్యంలో ఉద్యోగులంతా రెండో శనివారం పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనం వేడుకలు కొనసాగుతున్నాయి.