: పవన్ క‌ల్యాణ్‌ కొత్త సినిమా కాన్సెప్ట్ పోస్ట‌ర్ విడుదల!


ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా ద‌ర్శ‌కుడు త్రివిక్రమ్ ప్ర‌స్తుతం ఒక సినిమా రూపొందిస్తోన్న విష‌యం తెలిసిందే. రేపు పవన్ క‌ల్యాణ్‌ పుట్టినరోజు సంద‌ర్భంగా ‘పీఎస్‌పీకే#25’ హాష్ ట్యాగ్‌తో ఆ సినిమా యూనిట్ ఈ రోజు కాన్సెప్ట్ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్ ద్వారా ప‌వ‌న్ కొత్త‌ సినిమా ఎలా ఉండబోతుందన్న విష‌యాన్ని వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ దీర్ఘాలోచ‌న‌లో ఉన్నట్లు ఒక చిత్రం ఉండ‌గా, మ‌రో చిత్రంలో ప‌వ‌న్ కోపంగా న‌డుస్తూ వెళుతున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. పవన్ కల్యాణ్ కొత్త సినిమాలో కీర్తి సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ను ఇంకా ఖరారు చేయలేదు. 

  • Loading...

More Telugu News