: కేరళ ముఖ్యమంత్రితో కమల హాసన్ భేటీ!
రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తానని స్పష్టం చేసిన నటుడు కమల హాసన్ ఈ రోజు కేరళకు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలవడం చర్చనీయాశంగా మారింది. తిరువనంతపురంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన పినరయి విజయన్ తో ప్రస్తుతం చర్చిస్తున్నారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడిన కమలహాసన్ తాను కేరళ ముఖ్యమంత్రితో కలిసి ఓనమ్ వేడుకకు హాజరుకావాలనే వచ్చానని, తాను కేరళలో పర్యటించాలని గత ఏడాదే నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తమిళనాడులోని అన్నాడీఎం ప్రభుత్వంపై మండిపడుతోన్న కమల హాసన్ డీఎంకే పార్టీతో మాత్రం సన్నిహితంగా ఉంటున్నారు. తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసిన అనంతరం ఆయన కేరళ సీఎం వద్దకు రావడం ఆసక్తికరంగా మారింది.