: పిల్లాడు ఏడ్చాడని ఆటోగ్రాఫ్ ఇచ్చిన మెస్సీ... వీడియో చూడండి


ఫుట్‌బాల్ స్టార్ లియోన‌ల్ మెస్సీ మ‌రోసారి త‌నది గొప్ప మ‌న‌సు అని నిరూపించుకున్నాడు. కట్టుదిట్టమైన భద్రత నడుమ మెస్సీ ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేయ‌డానికి స్టేడియం లోప‌లికి న‌డుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ స‌మ‌యంలో అటుగా వ‌చ్చిన పిల్లాడిని సెక్యూరిటీ సిబ్బంది వెన‌క్కి నెట్ట‌డం, దాంతో ఆ పిల్లాడు ఏడుపు లంకించుకోవ‌డం గ‌మ‌నించాడు. వెంట‌నే ఆ పిల్లాడిని పిల‌వ‌మ‌ని సెక్యూరిటీని ఆదేశించాడు.

అప్ప‌టికే ప‌రిగెత్తుకుంటూ వెళ్లిపోయిన పిల్లాడిని ఓ సెక్యూరిటీ అధికారి వెళ్లి తీసుకువ‌చ్చాడు. ఆ పిల్లాడిని ఎత్తుకుని, ఒక సెల్ఫీ దిగి, ఆటోగ్రాఫ్ ఇచ్చి పంపించాడు మెస్సీ. మెస్సీ ద‌గ్గ‌రికి వెళ్ల‌గానే ఆ పిల్లాడిలో అప్ప‌టివ‌ర‌కు ఉన్న క‌న్నీళ్లు పోయి ఆనందంగా సెల్ఫీకి పోజిచ్చాడు. పిల్ల‌లంటే ఎంతో ఇష్ట‌ప‌డే మెస్సీ ఇలా చేయ‌డం ఇదేం మొద‌టిసారి కాదు. గ‌తేడాది ఆఫ్రికాకు చెందిన పిల్లాడికి మెస్సీ త‌న పేరుతో ఉన్న టీష‌ర్టును బహూక‌రించాడు.

  • Loading...

More Telugu News