: త్యాగానికి ప్రతీక బక్రీద్: ముస్లింలకు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి శుభాకాంక్షలు
త్యాగానికి ప్రతీక బక్రీద్ అని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీసీసీ కార్యాలయం నుంచి ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. అన్ని మతాల సారం ఒక్కటేనని త్యాగం, బలిదానం, పరిహతానికి ప్రతీక బక్రీద్ పండుగ అని ఆయన తెలిపారు. త్యాగాలకు ప్రతీక అయిన బక్రీద్‌ను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.