: రీమేక్ సినిమా షూటింగ్ పూర్తయింది: నటుడు సునీల్


మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘2 కంట్రీస్’ సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఎన్.శంకర్ దర్శకత్వంలో, స్వీయ నిర్మాణంలో తెరకెక్కించనున్న ఈ చిత్రంలో హీరో సునీల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా సునీల్ ఓ ట్వీట్ చేశాడు. ‘బ్లాక్ బస్టర్ మూవీ ‘2 కంట్రీస్’కు రీమేక్ గా నేను హీరోగా   శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించనున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి’ అని పేర్కొన్నాడు. కాగా, ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ఈ సినిమాలో నరేష్, షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, పృధ్వీ, శ్రీనివాస్ రెడ్డి, సిజ్జు, దేవ్ గిల్, శివారెడ్డి, ఝాన్సీ, సంజన తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. 

  • Loading...

More Telugu News