: పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై వైసీపీ ఎమ్మెల్యే చింతల స్పందన


నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ ఘోర ఓటమిని మూటగట్టుకోవడం ఆ పార్టీ నేతలను షాక్ కు గురి చేసింది. ఈ నేపథ్యంలో, ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించేందుకు రెడీ అవుతున్నారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే టీడీపీ కీలక నేతలతో టచ్ లో ఉన్నారనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా టీడీపీలో చేరుతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ నేపథ్యంలో, ఈ వార్తలపై చింతల స్పందించారు. పార్టీ మారుతున్నాననే ప్రచారాన్ని తానంటే గిట్టనివారే చేస్తున్నారని మండిపడ్డారు. తనను అప్రతిష్ఠపాలు చేసేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ తరపునే పోటీ చేస్తానని చెప్పారు.  

  • Loading...

More Telugu News