: నేపాల్ పారిపోయిన హనీ ప్రీత్ ఇన్సాన్?
అత్యాచారం కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జైలు శిక్ష పడిన తర్వాత అతని దత్తపుత్రిక హనీ ప్రీత్ ఇన్సాన్ నేపాల్ పారిపోయినట్లు తెలుస్తోంది. ఆమె మీద లుకౌట్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హనీప్రీత్ ఆచూకీ కనిపించడం లేదని పంచకుల డీసీపీ మన్బీర్ సింగ్ స్పష్టం చేశాడు. ఆమె నేపాల్ పారిపోయి ఉంటుందన్న అనుమానంతో ఆమె ఆచూకీ కోసం ఓ పోలీసు బృందాన్ని ఇండో-నేపాల్ సరిహద్దుకు పంపినట్లు తెలుస్తోంది. ఆమె మీద రాజద్రోహం నేరంతో పాటు, గుర్మీత్ విచారణకు హాజరవడానికి ముందు అతను తప్పించుకోవడానికి సహాయపడిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. డేరా చీఫ్ ఆదిత్యా ఇన్సాన్‌పై కూడా ఇవే ఆరోపణలు ఉన్నాయి.