: `ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవడానికి దేనికైనా సిద్ధం` అంటున్న కోల్‌కతా యువతి!
`బాహుబలి` చిత్రాల ద్వారా దేశవ్యాప్తంగా ప్రభాస్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక అమ్మాయిల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ కోవలోనే కోల్‌కతాకు చెందిన సుభద్రా ముఖర్జీకి కూడా ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే... పెళ్లి చేసుకునేంత!.. అవును నిజమే! ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవడానికి తాను దేనికైనా సిద్ధపడతానని సుభద్రా ముఖర్జీ అంటోంది. తన ప్రేమను ప్రభాస్ పుట్టినరోజున (అక్టోబర్ 23) తెలియజేయడానికి హైద్రాబాద్‌కి వచ్చేందుకు రెడీ అయింది. ప్రభాస్‌ను కలిసేలా చేస్తానని ఆయన సెక్రటరీ హామీ ఇచ్చారని, ఆయన్ని కలవడానికి బహుమతులతో సహా విచ్చేస్తున్నానని చెప్పింది.
రూ. లక్ష పెట్టి బాహుబలి విగ్రహాన్ని కూడా సుభద్ర తయారు చేయిస్తోంది. ఈ విగ్రహానికి కాస్ట్యూమ్ డిజైనర్ సమరేంద్ర సింగ్ రాయ్ దుస్తులు డిజైన్ చేస్తున్నారు. ఈ దుస్తుల ఖర్చే రూ. 20వేలు. అంతేకాకుండా ప్రముఖ గాయని ఉషా ఉతుప్‌తో ప్రభాస్‌పై నాలుగు పాటలు కూడా పాడించింది. చిన్నస్థాయి మోడల్‌గా పనిచేస్తున్న సుభద్ర ప్రభాస్ ప్రేమను పొందడానికి తన స్థాయికి మించి ఖర్చు చేస్తోంది. ఇదంతా ఎందుకు అంటే ‘ప్రేమను పొందడం అంత సులభం కాదు కదా?' అంటోంది. ప్రభాస్‌కు ప్రపోజ్ చేసే రోజున ధరించడం కోసం కాంజీవరం చీర కూడా సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం ప్రభాస్‌ను కలిశాక ఎలా ప్రపోజ్ చేయాలి అనే అంశాన్ని సాధన చేస్తోంది.
సుభద్ర కేవలం ప్రభాస్ కోసమే ‘బాహుబలి 2' సినిమాని 20 సార్లు చూసింది. ఆ సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లిపై వచ్చిన వార్తలు చూసి చాలా ఆందోళన చెందిందట. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఆమెకు అండగా ఉన్నట్లు చెప్పింది. వారి ప్రోత్సాహంతోనే ఇప్పుడు ప్రభాస్‌కు ప్రపోజ్ చేసేందుకు సిద్ధపడుతున్నానని సుభద్ర అంటోంది.