: వైసీపీకి నో భవిష్యత్తు.. నో భవిష్యత్తు..అయిపోయింది దాని పని: జేసీ దివాకర్ రెడ్డి


‘వైసీపీకి నో భవిష్యత్తు.. నో భవిష్యత్తు.. అయిపోయింది దాని పని’ అంటూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, ఆ పార్టీ నుంచి టీడీపీలోకి వలసలు తప్పవని అన్నారు. అయితే, ఆ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చే ఎమ్మెల్యేలను ఎంతమందిని తీసుకుంటారు, తీసుకోరనే విషయమై చంద్రబాబు ఆలోచించాల్సి  ఉందని అన్నారు.

 ‘నియోజకవర్గాల పునర్విభజన ఉండదని కేంద్రం చేసిన సూచనల నేపథ్యంలో మీ పార్టీలో సమస్యలు తలెత్తుతాయా?’అనే ప్రశ్నకు జేసీ స్పందిస్తూ, సమస్యలు సహజమేనని, అయితే, వాటిని ఎలా పరిష్కరిస్తారనేదే మనం చూడాల్సి ఉందన్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టీడీపీ విజయం ఊహించినదే అని, చంద్రబాబు నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి కాకినాడ గెలుపే నిదర్శనమని అన్నారు.

  • Loading...

More Telugu News