: నేను ఆత్మహత్యకు ప్రయత్నించడం ఏమిటి?: మహేశ్ కత్తి
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులు తనను వేధిస్తున్నారంటూ మీడియా ముందుకు వచ్చిన సినీ విశ్లేషకుడు మహేశ్ కత్తి వారిపై పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనపై ఎన్నో రూమర్లు వస్తున్నాయి. తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించానంటూ వచ్చిన రూమర్‌పై మహేశ్ కత్తి స్పందించాడు. ‘నేను ఆత్మహత్యకు ప్రయత్నించడం ఏమిటి స్వామీ?...బిందాస్ గా బ్రతుకుతుంటేను!’ అని తన ఫేస్‌బుక్ ఖాతాలో రాసుకొచ్చాడు. దీనిపై స్పందిస్తోన్న నెటిజన్లు ‘అలా రాసింది ఎవరు? చేతకాని వారే ఇటువంటి రూమర్లు ప్రచారం చేస్తుంటారు’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా, తనకు మద్దతు తెలుపుతున్న వారికి మహేశ్ కత్తి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు.