: రానా వెబ్‌సిరీస్ `సోష‌ల్‌` ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ ఇదే!


`వియూ` మీడియా సార‌థ్యంలో రానా ద‌గ్గుబాటి న‌టిస్తున్న వెబ్‌సిరీస్ `సోష‌ల్‌` ఫ‌స్ట్‌లుక్ విడుద‌లైంది. యువ‌తపై సోష‌ల్ మీడియా ప్ర‌భావాలే క‌థాంశంగా ఈ వెబ్‌సిరీస్‌ను తీశారు. సినిమాలు, వ్యాఖ్యానం, వెబ్‌సిరీస్‌ల్లో కూడా న‌టిస్తూ దూసుకుపోతున్న రానా ఈ ఫ‌స్ట్‌లుక్‌కి హైలెట్‌గా క‌నిపిస్తున్నాడు.

వెబ్‌సిరీస్ గురించి రానా మాట్లాడుతూ - `సోష‌ల్' ద్వారా ప్రేక్ష‌కుల ముందుకి ఓ కొత్త రానా రాబోతున్నాడు. డిజిట‌ల్ మీడియాలో ఇది నా మొద‌టి అడుగు. ఈ వెబ్‌సిరీస్‌ను అంద‌రూ ఆద‌రిస్తార‌ని ఆకాంక్షిస్తున్నా` అన్నాడు. తెలుగు, హిందీ భాష‌ల్లో ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నారు. దీనికి వ్యాక‌వుట్ మీడియా, గురు ఫిలింస్ నిర్మాణ బాధ్య‌త‌లు చేప‌ట్టాయి. 13 ఎపిసోడ్లుగా రానున్న ఈ సిరీస్‌లో త‌ప్పిపోయిన యువ‌తి మిస్ట‌రీని సోష‌ల్ మీడియా ద్వారా ఎలా ఛేదించార‌నేది చూపించ‌నున్నారు. సెప్టెంబ‌ర్ 8న వియూ వెబ్‌ఛాన‌ల్‌లో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. దీనికి శ‌శి సుడిగాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. న‌వీన్ క‌స్తూరియా, ప్రియా బెన‌ర్జీలు ఇత‌ర కీల‌క పాత్ర‌లు పోషించారు.

  • Loading...

More Telugu News