: బాలయ్య బాబు సెక్సీ.. ఇంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదు: రాజమౌళి
నందమూరి బాలకృష్ణ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పైసా వసూల్' సినిమా హిట్ టాక్ ను సంపాదించుకుంది. రివ్యూలన్నీ సినిమా చాలా బాగుందని చెబుతున్నాయి. బాలయ్య 101వ సినిమా సక్సెస్ కావడంతో ఆయన అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ నేపథ్యంలో మరో విజయాన్ని చేజిక్కించుకున్న బాలయ్యపై సినీ ప్రముఖలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక దిగ్గజం రాజమౌళి బాలయ్యపై ప్రశంసలు కురిపించాడు. "కోకాకోలా పెప్సీ! బాలయ్య బాబు సెక్సీ!! ఇంతకు మించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు" అంటూ ట్వీట్ చేశాడు. గత 100 సినిమాల్లో లేనంత ఎనర్జిటిక్ గా బాలయ్యను పూరి జగన్నాథ్ చూపించాడని కితాబిచ్చాడు.