: కాకినాడ మేయర్ రేసులో నలుగురు మహిళలు?


కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో గెలిచిన అభ్యర్థులు సంబరాలు చేసుకుంటున్నారు. కాకినాడ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి సరిపడే స్థానాలు టీడీపీకి సొంతంగానే లభించాయి. దీంతో, ఆ పదవి ఎవరు కైవసం చేసుకుంటారనే విషయం ఆసక్తిదాయకంగా మారింది. మేయర్ బరిలో శేషకుమారి, అడ్డూరి లక్ష్మి, సుంకర పావని, సుంకర శివప్రసన్న ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

మేయర్ పదవికి ఎవరిని ఎంపిక చేస్తారనే విషయమై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, మేయర్ పీఠాన్ని కాపు వర్గానికే కేటాయిస్తామంటూ టీడీపీ నాయకత్వం గతంలో ప్రకటించింది. ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే మేయర్ పదవి కేటాయిస్తారా? లేదా? అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News