: ఈ 'అల్లా' మేక ఖరీదు అక్షరాలా కోటి రూపాయలు!


భారీ వర్షాలతో అతలాకుతలమైన ముంబై నగరం బక్రీద్ పండుగకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ముంబైలోని డియోనర్ వధశాలకు వేలాదిగా మేకలను తీసుకొచ్చారు. వీటిలో ఓ మేక మాత్రం అందరినీ ఆకర్షిస్తోంది. దాని మెడ భాగంలో అరబ్ లో 'అల్లా' సింబల్ ను పోలిన గుర్తులు ఉన్నాయి. దీంతో, దాని యజమాని ఆ మేకను అక్షరాలా కోటి ఏడువందల ఎనభై ఆరు రూపాయలకు అమ్మకానికి పెట్టాడు. ఈ సందర్భంగా యజమాని సొహైల్ మాట్లాడుతూ, మేక వయసు 15 నెలలని చెప్పాడు. దానికి ఉన్న ప్రత్యేకత వల్లే భారీ ధరకు అమ్మకానికి పెట్టానని చెప్పాడు. అయితే, అంత ధరకు మేకను కొనడానికి ఇంతవరకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో, ధరను సగానికి తగ్గిస్తున్నట్టు తెలిపాడు.

  • Loading...

More Telugu News