: కాకినాడ కార్పొరేషన్ తుది ఫలితాల వివరాలు!


కాకినాడ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం జయకేతనం ఎగురవేసింది. మొత్తం 48 స్థానాలకు ఎన్నికలు జరుగగా, అన్నింటా ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 35 డివిజన్లలో గెలుపొందిన టీడీపీ, బీజేపీ కూటమికి కార్పొరేషన్ అధికారం దక్కింది. తెలుగుదేశం పార్టీ 32 స్థానాల్లో, బీజేపీ 3 స్థానాల్లో గెలుపొందాయి. టీడీపీకి గట్టి పోటీని ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10 స్థానాలు దక్కాయి. మరో మూడు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. సుమారు సగం డివిజన్లలో పోటీచేసిన కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా విజయం లభించకపోగా, చాలా చోట్ల డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది.

  • Loading...

More Telugu News