: జియో ఉచిత ఫోన్లు వచ్చేశాయి... తొలి అన్ బాక్సింగ్ వీడియో!
రిలయన్స్ జియో ప్రకటించిన ఉచిత 4జీ ఫీచర్ ఫోన్ (తొలుత రూ. 1500 డిపాజిట్ చెల్లిస్తే, మూడేళ్ల తరువాత తిరిగిస్తారు) వచ్చేసింది. గత నెల 24న ఫోన్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభం కాగా, తొలి విడత ఫోన్లు డెలివరీ అయ్యాయి. ఫోన్ అన్ బాక్సింగ్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోన్ తో పాటు ఏమేం వచ్చాయి? బ్యాటరీ సామర్థ్యం, దాన్ని ఫిక్స్ చేసుకోవడం వంటివి ఈ వీడియోలో ఉన్నాయి. ఫోన్ ను ఆన్ చేస్తే, మై జియో, జియో టీవీ, జియో మ్యాజిక్, కాల్ లాగ్ వంటి యాప్స్ కనిపిస్తున్నాయి. జియో స్టోర్ పేరిట ప్రత్యేక ప్లే స్టోర్ కూడా ఇందులో ఉంది. కెమెరా, వీడియో ప్లేయర్ ఉన్నాయి. సాఫ్ట్ వేర్ వర్షన్ కైఓస్ 2.0 ఆధారంగా పని చేసే ఫోన్ మోడల్ నంబర్ ఎల్ వైఎఫ్ 2403 అని కనిపిస్తోంది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.