: కేసు పెడతానని నాన్నను బెదిరించాను.. అమ్మానాన్నలు నాతో మాట్లాడటం మానేశారు: 'అర్జున్ రెడ్డి' హీరోయిన్


అనేక వివాదాలు, నెగెటివ్ పబ్లిసిటీల మధ్య 'అర్జున్ రెడ్డి' సినిమా కమర్షియల్ హిట్ ను సాధించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండే ఈ హిట్ తో పాప్యులర్ అయింది. తాజాగా ఓ షోలో ఆమె మాట్లాడుతూ తన జీవితానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించింది. తాను ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అని, తన తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పింది. తనకు మొదటి నుంచి సినిమాలు అంటే ఇష్టమని... కానీ, తన తండ్రికి మాత్రం ఇష్టం లేదని తెలిపింది.

 తాను ఉద్యోగం చేయాలని తన తండ్రి కోరుకున్నారని... అయితే, ఆయన మాట వినకుండా తాను సినిమా ప్రయత్నాలు చేశానని... దీంతో, తన తండ్రి తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్త చేశారని చెప్పింది. ఒకానొక సమయంలో కేసు పెడతానని తన తండ్రిని బెదిరించినట్టు తెలిపింది. అప్పటి నుంచి తన తల్లిదండ్రులు తనతో మాట్లాడటం మానేశారని చెప్పింది. అయినప్పటికీ సినిమా అవకాశాల కోసం చేస్తున్న ప్రయత్నాలను తాను ఆపలేదని... చివరకు స్నేహితుల సాయంతో 'అర్జున్ రెడ్డి' సినిమాలో అవకాశం పొందానని తెలిపింది.

  • Loading...

More Telugu News