: హిట్టయిందట... థియేటర్ లో పేలుతున్న 'పైసా వసూల్' డైలాగుల్లో కొన్ని!
ఈ ఉదయం విడుదలైన 'పైసా వసూల్' చిత్రం అభిమానులను అలరిస్తుండగా, మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. పలు వెబ్ సైట్ లు ఈ చిత్రానికి సగటున 3.25 రేటింగ్ ను ఇస్తున్నాయి. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉండటం, డైలాగులు ఆకట్టుకునేలా ఉండటం సినిమాకు ప్లస్ పాయింట్స్ అయ్యాయని విశ్లేషకులు అంటున్నారు. ఇక సినిమాలోని కొన్ని డైలాగులు ఆడియన్స్ తో విజిల్స్ వేయిస్తున్నాయట.
సినిమాను వీక్షించిన పలువురు బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
" బీహార్‌లో తాగించిన వాడిని తీహార్ లో పోయించా... తూ క్యారే అవులే",
"నన్ను ఇక్కడ కాల్చాలంటే నా అభిమానులైనా అయ్యి ఉండాలి, నా బంధువులైనా అయి ఉండాలి",
"సింహానికి మేకను ఎరేయాలనుకోవడం కరక్టే కానీ ఆ ప్లాన్ ను మేకలన్నీ కలిపి చేయడమే ఫన్నీగా ఉంది",
"జేబులో చెయ్యిపెట్టు.. ఏమైనా తగిలిందా?" వంటి పవర్ ఫుల్ పంచ్ డైలాగులు చాలానే ఉన్నాయి.