: పెళ్లి పీటలెక్కిన కన్నడ హీరోయిన్ సింధు
ప్రముఖ కన్నడ హీరోయిన్ సింధు పెళ్లి పీటలెక్కింది. మంగళూరుకు చెందిన శ్రేయస్ కోడియాళ్ ను ఆమె వివాహమాడింది. ఓ మల్టీ నేషనల్ కంపెనీలో శ్రేయస్ హెచ్ఆర్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. వీరిద్దరూ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో... వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 'మిస్టర్ లవంగం' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సింధు... ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోవడంతో కన్నడ సినీరంగంపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించింది.