: అమెరికాను ట్రంప్ కంటే నా కూతురే సమర్థవంతంగా పాలించగలదు: టీవీ నటి కిమ్ కర్దాషియాన్


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై టీవీ నటి కిమ్ కర్దాషియన్ సెటైర్ వేసింది. అమెరికాలోని రియాలిటీ టీవీ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న కిమ్ కర్ధాషియాన్ ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రపంచంలో అమెరికాను అగ్రరాజ్యంగా నిలిపేందుకు దేశ పౌరులు చాలా కష్ట పడ్డారని తెలిపింది. అమెరికా గొప్ప దేశమని చెప్పుకునేందుకు చాలా కారణాలున్నాయని ఆమె చెప్పింది.

ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశాన్ని మళ్లీ వెనక్కి తీసుకెళ్తున్నారని ఆమె అభిప్రాయపడింది. దేశంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియడం లేదని ఆమె చెప్పింది. ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచి ప్రజల్లో ఆందోళన నెలకొందని ఆమె తెలిపింది. ట్రంప్ కంటే బాగా ఎవరైనా అమెరికాను పరిపాలించగలరని తెలిపింది. తన నాలుగేళ్ల కుమార్తె కూడా ట్రంప్ కంటే మెరుగ్గా పరిపాలించగలదని ఆమె పేర్కొంది. ఆమె అమెరికా అధ్యక్షురాలైనా బాగుండేదని జోక్ చేసింది.

  • Loading...

More Telugu News