: కెరీర్ తొలిమ్యాచ్‌లోనే శార్దూల్ ఠాకూర్‌పై విమర్శల వర్షం.. సచిన్ జెర్సీ ధరించడంపై మండిపడుతున్న అభిమానులు!


శ్రీలంకతో గురువారం కొలంబోలో జరిగిన నాలుగో వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన శార్దూల్ ఠాకూర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో శార్దూల్ నెంబర్ 10 జెర్సీని ధరించి బరిలోకి దిగాడు. సరిగ్గా ఇదే విమర్శలకు కారణమైంది. ఈ జెర్సీని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ధరించేవాడు. దిగ్గజ ఆటగాడు ధరించిన జెర్సీ నంబరును శార్దూల్ ఉపయోగించుకోవడంపై క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

తొలి మ్యాచ్‌లో 26 పరుగులిచ్చి ఒక వికెట్ తీసిన శార్దూల్‌పై ప్రశంసలు కురుస్తున్నా అదే సమయంలో నెంబర్ 10 జెర్సీ ధరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శార్దూల్ ఈ జెర్సీ ధరించడాన్ని గుర్తించిన క్రికెట్ కామెంటేటర్ హర్షాభోగ్లే ఫొటోను షేర్ చేశాడు. అదికాస్తా వైరల్‌గా మారి విమర్శలకు కారణమైంది.

సచిన్‌కు తప్ప ఆ జెర్సీని ధరించే అర్హత మరెవరికీ లేదని నెటిజన్లు కామెంట్ చేశారు. ఆ జెర్సీ కథ ఇక ముగిసిందని, అది దేవుడిదని, వేరెవరికీ దానిని ధరించే అర్హత లేదంటూ ట్విట్టర్ వేదికగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఠాకూర్ ఇకనైనా ఈ జెర్సీని విడిచిపెట్టాలని సచిన్ అభిమానులు కోరుతున్నారు. కాగా, 25 ఏళ్ల శార్దూల్ భారత్ తరపున వన్డేల్లో ఆడుతున్న 218వ క్రికెటర్.

  • Loading...

More Telugu News