: 2019 కల్లా స్విస్ నల్లకుబేరుల జాబితా ఇస్తాం: స్విస్ అధ్యక్షురాలి హామీ


నల్లకుబేరుల వివరాల తొలి జాబితాను 2019 కల్లా అందజేస్తామని స్విట్జర్లాండ్‌ అధ్యక్షురాలు డోరిస్‌ ల్యూథర్డ్‌ హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆమె ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిపిన విస్తృత చర్చల్లో ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలతో పాటు ద్వైపాక్షిక సంబంధాలు, పన్ను ఎగవేత, నల్లధనాన్ని వెలికితీసేందుకు సహకారంపై అవగాహనకు వచ్చారు.

ఈ సందర్భంగా అణు ఇంధన సరఫరా దేశాల గ్రూప్‌ (ఎన్‌ఎస్‌జీ) లో, క్షిపణి సాంకేతిక పరిజ్ఞానం నియంత్రణ వ్యవస్థ (ఎంటీసీఆర్‌) లో సభ్యత్వానికి మద్దతు తెలపడంపై ఆమెకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. పన్ను ఎగవేత సమాచార ఆటోమేటిక్ మార్పిడి చట్టాన్ని ఈ ఏడాది చివరికల్లా పార్లమెంటు ఆమోదిస్తుందని ఆమెకు హామీ ఇచ్చారు. రైల్వే రంగంలో సహకారానికి రెండు ఒప్పందాలు కుదుర్చుకున్నామని మీడియా సమావేశంలో తెలిపారు. 

  • Loading...

More Telugu News