: పాకిస్థాన్ కు మేం చేసిన సాయం లెక్కలు ఇవిగో!: అమెరికా
అమెరికా చేసిన సాయం టైమ్ పాస్ కోసం తినే 'పల్లీ'లతో సమానమని పాక్ హోంశాఖ మాజీ మంత్రి నిస్సార్ వ్యాఖ్యానించడంతో వేగంగా స్పందించిన అమెరికా ఇంతవరకు ఆ దేశానికి చేసిన సాయంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. 2002 నుంచి 225 మిలియన్ డాలర్ల (1629 కోట్ల రూపాయల) ను పాకిస్తాన్ ఆర్మీకి ఉగ్రవాద నిరోధానికి అందజేశామని తెలిపింది. 'అమెరికా మాకు చేసిన సహాయం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్రవాదులను అంతం చేయలేక మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారు' అంటూ పాక్ ప్రకటనలు చేయడంతో అమెరికా తాజాగా ఓ ప్రకటన చేసింది.
'ఉగ్రవాద నిరోధానికి పాక్ ఆర్మీ పాటుపడుతుందని భావించాము. కానీ పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోంది. ఉగ్రవాదుల పాలిట స్వర్గధామంగా మారింది' అంటూ రెక్స్ టెల్లర్సన్ అభిప్రాయపడ్డారు. దీంతో పాకిస్థాన్ కు ఆయుధాల విక్రయం వద్దని పలువురు అమెరికాకు సూచిస్తున్నారు. ఈ మేరకు ట్రంప్ ను ఒప్పించేందుకు చర్చించినట్టు కూడా తెలుస్తోంది. అమెరికాతో సన్నిహితంగా మెలిగిన పాక్ గతంలో వ్యూహాత్మంగా ఎఫ్-16 విమానాలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.