: గంటకు నాలుగు వేల కిలోమీటర్ల వేగంతో వెళ్లే విమానం తయారీకి చైనా ప్లాన్స్!
పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ రంగంలో సరికొత్త విప్లవానికి చైనా ప్రయత్నిస్తోంది. ఆ దేశంలో జనాభా ఎక్కువ కావడంతో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సరికొత్త ట్రాన్స్ పోర్ట్ విప్లవానికి చైనా తెరతీసింది. గంటకు నాలుగు వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే విమానాన్ని తయారు చేసేందుకు చైనా వ్యూహాలు రచిస్తోంది.
ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. గంటకు 4 వేల కిలోమీటర్ల వేగంతో వెళ్లే హైపర్ ఫ్లైట్ ట్రాన్స్ పోర్ట్ నెట్ వర్క్ ను అభివృద్ధి చేయనున్నామని చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ (సీఏఎస్ఐసీ) తెలిపింది. సంప్రదాయ బుల్లెట్ ట్రైన్స్ వేగం కంటే పది రెట్ల వేగంతో, విమానాల వేగం కంటే 5 రెట్ల వేగంతో వెళ్లేలా వీటిని తయారు చేస్తామని ప్రకటించింది. ఈ హైపర్ ఫ్లైట్ నెట్ వర్క్ కోసం 20 జాతీయ అంతర్జాతీయ పరిశోధనా సంస్థలతో జట్టు కట్టామని సీఏఎస్ఐసీ వెల్లడించింది.