: ఉద్రిక్తతలు పెంచకండి.. సైనిక చర్య ఆలోచనను విరమించండి: అమెరికాకు రష్యా సూచన!


అమెరికా- ఉత్తరకొరియాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపు దాలుస్తున్న తరుణంలో రష్యా రంగంలోకి దిగింది. యూఎస్ విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌ సన్‌ కు రష్యా విదేశీవ్యవహారాల శాఖా మంత్రి సెర్జీ లవ్‌ రోవ్ ఫోన్ చేశారు. ఉత్తరకొరియాపై సైనిక చర్యకు దిగితే ఊహించలేని పరిణామాలు ఎదురవుతాయని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరకొరియాపై సైనిక చర్య ఆలోచనను విరమించుకోవాలని ఆయన హెచ్చరించారు.

మిలటరీ విన్యాసాల పేరుతో దక్షిణ కొరియాలో అమెరికా సైన్యంతో పాటు పెద్ద పెద్ద బాంబర్లను మోహరించడం ఉత్తరకొరియాను ఆత్మరక్షణలో పడేస్తుందని, దీంతో ఆ దేశం తీవ్రంగా స్పందించే అవకాశం ఉందని హెచ్చరించింది. దీనిని అవకాశంగా తీసుకుని ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించడం కూడా ప్రమాదమని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో కిమ్ చర్యలు తీవ్రమైనవని, ఐక్యరాజ్యసమితి నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News