: ‘పద్మ’ అవార్డు కోసం పలుసార్లు దరఖాస్తు చేసిన గుర్మీత్ !
అత్యాచార కేసుల్లో ఇరవై ఏళ్ల జైలు శిక్షకు గురైన డేరా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం. ‘పద్మ’ అవార్డు దక్కించుకునేందుకు గుర్మీత్ ఇప్పటివరకు ఐదుసార్లు దరఖాస్తు చేసుకున్నాడట. అంతేకాకుండా, 2017 ‘పద్మ’ అవార్డులకు గానూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు మొత్తం 18,768 దరఖాస్తులు రాగా, అందులో, అత్యధికంగా 4,208 మంది గుర్మీత్ పేరును ప్రతిపాదించారట. మొత్తం మూడు ‘పద్మ’ అవార్డుల్లో ఏ ఒక్కటైనా సరే, గుర్మీత్ కు ఇచ్చి గౌరవించాలని ప్రతిపాదించిన వారిలో హర్యానాలోని హిస్సార్ కు చెందిన సెయింట్ జార్జ్ సోనెట్, ఇండియా సెయింట్ జార్జ్ ఉన్నారు. గుర్మీత్ కు ‘పద్మ’ అవార్డు ఇవ్వాలంటూ డేరా ఆశ్రమం నుంచే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని సంబంధిత వర్గాల సమాచారం.