: ‘మామా ఏక్ పెగ్ లా’ అంటూ బాలయ్య డైలాగులు చెప్పిన చిన్నారి వీడియోను పోస్ట్ చేసిన పూరీ జగన్నాథ్!
నందమూరి బాలకృష్ణ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ‘పైసా వసూల్’ సినిమా రేపు విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య స్వయంగా పాడిన ‘మామా ఏక్ పెగ్ లా’ పాట గురించి పూరీ ఇటీవలే మాట్లాడుతూ... ఈ పాటని పిల్లలు కూడా పాడేస్తున్నారని, దీంతో తనకు భయం వేస్తోందని చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఈ పాటను పాడుతూ, బాలకృష్ణ చెప్పిన డైలాగులను చెప్పిన ఓ బాలిక వీడియోను ఈ రోజు పూరీ జగన్నాథ్ తన ట్విట్టర్ ఖాతాలో ఉంచాడు. దీనికి అమేజింగ్ కిడ్ అని టైటిల్ పెట్టాడు. ‘పైసా వసూల్’ సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగులను ఈ వీడియోలో ఆ పాప గడగడా చెప్పేస్తోంది. చివరకు మామా ఏక్ పెగ్ లా అని పాడేస్తోంది.. మీరూ చూడండి...