: ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడిపై వీహెచ్ మండిపాటు


‘అర్జున్ రెడ్డి’ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) మండిపడ్డారు. బాధ్యత లేకుండా ఇష్టానుసారం సినిమా తీస్తే, సమాజం ఏమైపోతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సుల మీద ముద్దు సీన్లు ఉన్న పోస్టర్లు చూసి యాక్సిడెంట్లు అవుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో డ్రగ్స్  నిరోధించాలని సీఎం కేసీఆర్ చెబుతుంటే, ఆయన కుమారుడు కేటీఆర్ మాత్రం డ్రగ్స్ సీన్లు ఉన్న సినిమా చూసి బాగుందని ప్రశంసిస్తున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News