: యాంకర్ తో కలసి ‘కత్తి ఫ్రైడ్ చికెన్' తయారు చేశానంటున్న మహేశ్ కత్తి!
తెలుగు ‘బిగ్ బాస్’ షో నుంచి ఇటీవలే ఎలిమినేట్ అయిన కత్తి మహేశ్, చికెన్ వండటంలో చేయి తిరిగిన వ్యక్తి. ‘బిగ్ బాస్’ షో వ్యాఖ్యాత జూనియర్ ఎన్టీఆర్ ఆదేశాల మేరకు చికెన్ వండిన కత్తి మహేశ్ ని అద్భుతంగా వండావంటూ నాడు తారక్ ప్రశంసించడం విదితమే. ‘ఈ చికెన్.. కత్తి చికెన్’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ మెచ్చుకోవడం తెలిసిందే. తాజాగా, కత్తి మహేశ్ మరో నాన్ వెజ్ వంటకం తయారీకి సిద్ధమయ్యాడు. ప్రముఖ యాంకర్ కత్తి కార్తీకతో కలసి ‘కత్తి ప్రైడ్ చికెన్’ వంటకాన్ని తయారు చేస్తున్నానంటూ కత్తి మహేశ్ తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నాడు. ఈ వంటకం తయారీకి కావాల్సిన పదార్థాలను ట్రేలో పట్టుకుని ఉన్న కార్తీకతో కలసి మహేశ్ ఓ సెల్ఫీ దిగి అది పోస్ట్ చేశాడు.