: పూరీ కాంబినేషన్ లో మరో సినిమా చేస్తా: బాలకృష్ణ


‘పైసా వసూల్’ తర్వాత దర్శకుడు పూరీ జగన్నాథ్ తో తనకు సాన్నిహిత్యం పెరిగిందని, త్వరలో పూరీ కాంబినేషన్ లో మరో సినిమా చేస్తానని ప్రముఖ నటుడు బాలకృష్ణ చెప్పారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ,‘ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. దర్శకత్వం, డైలాగ్స్, మ్యూజిక్ ఇలా ప్రతిఒక్కటీ బాగా వచ్చాయి. ఈ సినిమా ఇంటర్వెల్ లో ఓ బ్యాంగ్ ఉంది. అది, అసలు డైలాగ్. చిన్న డైలాగే..ఎంతో పదునైన డైలాగ్. ఆ డైలాగ్ ను ఇంకా ఎక్కడా చెప్పలేదు. సినిమా చూస్తారుగా! ‘వచ్చాడు వచ్చాడు వచ్చేశాడు..’ అంటూ భాస్కరభట్ల రాసిన పాట చాలా అద్భుతం’ అని అన్నారు.

  • Loading...

More Telugu News