: ‘పైసా వసూల్’లో నా అసలు పేరేంటో ఇంతవరకూ బయటపెట్టలేదు..అదే సీక్రెట్: నటుడు బాలకృష్ణ


అగ్రనటుడు బాలకృష్ణ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందించిన ‘పైసా వసూల్’ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో నా అసలు పేరేంటో ఇంతవరకు బయట పెట్టలేదు. అదే సీక్రెట్.  కావాలనే మేము బయటపెట్టలేదు. రేపు సినిమా విడుదల అవుతుండగా ప్రేక్షకులు చూస్తారు. ఆ  పేరేంటో తెలుసుకుంటారు. ఈ సినిమాలో నేను చాలా అందంగా కనపడటానికి కారణం పూరీ, ఛార్మీయే.

ఈ సినిమాలో నేను పాట పాడాను. పైసా వసూల్ చిత్రంలో నన్ను డిఫరెంట్ గా చూస్తారు. ప్రతి సినిమాకు వైవిధ్యం చూపించడం నా ప్రత్యేకత. నేను ఎప్పుడైనా డిస్టరబ్డ్ గా ఉంటే.. నాన్న గారి పాటలు పాడుకుంటూ, వింటూ ఉంటాను. శ్రీకృష్ణపాండవీయం సినిమాలోని ‘మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా’ అనే పాటను, బ్రహ్మంగారి చరిత్ర సినిమాలోని ‘మాయదారి..’ అనే పాటను వింటూ ఉంటాను’ అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News