: సినిమా బాగుంటే కాంట్రావర్సీస్ ను ఎవరూ పట్టించుకోరు: విజయ్ దేవరకొండ
తాను ఏ సినిమా చేసినా తెలుగు అమ్మాయిని హీరోయిన్ గా పెట్టమని చెబుతానని, కానీ, సమయానికి అలా జరగట్లేదని ‘అర్జున్ రెడ్డి’ హీరో విజయ్ దేవరకొండ అన్నాడు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో హీరోయిన్ షాలిని, జబల్ పూర్ కు చెందిన అమ్మాయి అని, ఆమె ప్రొఫైల్ చాలా బాగుందని చెప్పాడు. ఏ సినిమా అయినా బాగుంటే కాంట్రావర్సీస్ ఎంత చేసినా ఎవరూ పట్టించుకోరని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ప్రేమ యొక్క స్వచ్ఛమైన రూపం ‘కిస్’ అని, కాంట్రావర్సీ సినిమా తాము తీయలేదని, ఈ సినిమాపై కొందరు కాంట్రావర్సీ చేస్తున్నారని అన్నారు. ఈ సినిమాలో హిపోక్రసీ లేదని, ఇలాంటి ప్రేమకథలు చాలా ఉంటాయని, అందుకే, ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చిందని, బాగా ఆదరిస్తున్నారని చెప్పాడు.