: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై పోరాడుతున్న మహేశ్ కత్తికి పెరుగుతున్న మద్దతు
సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభిమానులు తనను టార్చర్ చేస్తున్నారంటూ సినీ విశ్లేషకుడు మహేశ్ కత్తి మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు మద్దతు పెరిగిపోతోంది. ‘ఐ సపోర్ట్ మహేశ్ కత్తి’ అనే నినాదంతో సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి వ్యతిరేకంగా నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. వారితో పాటు పలువురు ప్రముఖులు కూడా మహేశ్ కత్తికి మద్దతు తెలుపుతున్నారు.
సామాజిక ఉద్యమకారుడు, కవి, రచయిత, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పసునూరి రవిందర్.. మహేశ్ కత్తికి మద్దతు పలుకుతూ ‘మేం తోలు తెగకుండా గొడ్డును కోసెటోళ్లం జాగ్రత్త...! మా కోపం కట్టలు తెగనియ్యకుండ్రి’ అని పవన్ అభిమానులను హెచ్చరించారు. విరసం కార్యదర్శి, అరుణతార పత్రిక సంపాదకుడు, మానవహక్కుల ఉద్యమ కార్యకర్త వరలక్ష్మి కూడా పవన్ ఫ్యాన్స్ తీరును విమర్శించారు. వీరేకాక మరికొంత మంది ప్రముఖులు కూడా మహేశ్ కత్తికి మద్దతు తెలుపుతున్నారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చర్యలు సరైనవి కావని హెచ్చరిస్తున్నారు.