: రైలులో విజయవాడ యువతిని వేధించిన యువకులు.. రైల్లోంచి దూకేసిన అమ్మాయి


విజయవాడకు చెందిన ఓ యువతిని రైలులో కొంతమంది యువకులు వేధించారు. దీంతో అవ‌మానంగా భావించిన ఆ అమ్మాయి రైల్లోంచి దూకేసింది. తీవ్ర‌గాయాల పాల‌యిన ఆమెను రైల్వే సిబ్బంది ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు వివ‌రాలు తెలిపారు. విజ‌య‌వాడ‌కు చెందిన షేక్ న‌జ్మూల్ అనే యువ‌తికి ఈ రోజు పెళ్లి చూపులు ఉన్నాయ‌ని, దీంతో చెన్నైలో ప‌నిచేస్తోన్న ఆమె... రైలులో త‌న స్నేహితురాళ్ల‌తో క‌లిసి సొంత ఊరికి ప్ర‌యాణిస్తోంద‌ని అన్నారు. రైలులో పోకిరీలు వేధించ‌డంతో ప్ర‌కాశం జిల్లాలోని సింగ‌రాయ‌కొండ వ‌ద్ద ఆమె రైలులో నుంచి దూకేసింద‌ని చెప్పారు. ఈ ఘటనకు పాల్పడ్డ యువకుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. 

  • Loading...

More Telugu News